వైసీపీ కీలక నేత, కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వల్పంగా గాయపడ్డారు. వైసీపీ చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మంగళవారం గుడివాడలో పర్యటించిన నాని... జనంతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఇళ్లల్లోకి వెళ్లి మరీ వారితో ముచ్చటించారు. తమ ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు.
ఈ క్రమంలో ఓ ఇంటిలోకి వెళ్లిన నాని... ఆ ఇంటిలో మంచంపై కూర్చోబోయారు. ఈ సందర్భంగా ఆయన కుడి కాలు మంచం కోడుకు బలంగా తగిలింది. దీంతో నాని మోకాలుకు గాయమైంది. దీంతో ఒకింత ఇబ్బంది పడ్డ నాని...అక్కడే కూర్చుని తన కాలికి ఉన్న ప్యాంట్‌ను పైకి జరుపుకుని మరీ ఏ మేర గాయమైందన్న విషయాన్ని చూసుకున్నారు. మంచం కోడు తగలడంతో కలిగిన నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు మోకాలిని చేతితో రాసుకున్నారు.