ఏపీలోని తిరుపతి జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కొడుకు మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఓ తండ్రి బైక్ పైనే తన కొడుకు మృతదేహాన్ని తరలించాడు. కేవీబీపురం మండలం దిగువ పుత్తూరు గ్రామానికి చెందిన బసవయ్య(7)ను మంగళవారం ఉదయం పాము కరిచింది. కుటుంబ సభ్యులు వెంటనే కేవీబీపురంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చారు. అయితే దురదృష్టవశాత్తూ ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే బాలుడు మృతిచెందాడు. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు బాలుడి తండ్రి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ఎవరూ ముందుకు రాలేదు. దీంతో తెలిసిన వారి బైక్ పైనే కొడుకు శవాన్ని తరలించాడు.