పంజాబ్‌లోని లూథియానాలో దారుణం జరిగింది. జస్పాల్ సింగ్, బాధిత యువతి(26) స్నేహితులు. తనకు షాపింగ్‌లో సాయం చేసేందుకు రావాలని ఆ యువతిని సెప్టెంబర్ జస్పాల్ సింగ్ పిలిచాడు. ఫ్రెండ్ కదా అని నమ్మి వెళ్లిన యువతికి జస్పాల్ మత్తు మందు ఇచ్చాడు. స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెను బంధించి, 9 రోజులు అత్యాచారం చేశాడు. అక్కడి నుంచి అక్టోబర్ 8న తప్పించుకుని, పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు అరెస్ట్ అయ్యాడు.