స్కిల్ హాబ్స్ నందు యువతకు శిక్షణ ఇవ్వడానికి స్కిల్ కమిటీ తగిన ప్రణాళికలను రూపొందించి జిల్లాలో ప్రతి నెల రెండవ, నాల్గవ శుక్రవారం జాబ్ మేళాలు నిర్వహించి ఉపాధి కల్పించాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస రావు అన్నారు. బుధవారం కలెక్టరేట్ నందు డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ అధికారి సమీక్ష నిర్వహించారు.
జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సంకల్ప్ ప్రాజెక్ట్ ద్వారా జిల్లా నందు డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని, కమిటీ ముఖ్య ఉద్దేశం జిల్లాలోని యువతకు పరిశ్రమలకు కావాల్సినటువంటి నైపుణ్యం పై వివిధ రంగాలలో శిక్షణ ఇచ్చి వారికి ఉద్యోగ అవకాశాలను కల్పించడానికి జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్కిల్ హాబ్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని యువతకు నైపుణ్యాలను మెరుగుపరచడానికి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీ సమన్వయం చేసుకోవాలని తెలియజేశారు.
పిడి డిఆర్డిఎ జ్యోతి మాట్లాడుతూ జిల్లాలోని యువతకు జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ మేళా క్యాలెండర్ ను ప్రణాళికబద్ధంగా జరగాలని అదేవిధంగా స్కిల్ హాబ్స్ ద్వారా యువతకు శిక్షణ పొందడానికి అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేస్తూ తగిన ప్రణాళికలను రూపొందించుకోవాలని తెలియజేశారు.