ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వరదలతో అనంతపురం అతలాకుతలం.. జలదిగ్బంధంలో 17 కాలనీలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 13, 2022, 10:35 AM

మంగళవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి అనంతపురం అతలాకుతలమైంది. గురువారం కూడా కాలనీలు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని 12 కాలనీలు, రుద్రంపేటలోని ఐదు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నడిమివంకకు వరదనీరు పోటెత్తడంతో కాలనీల్లో ఐదడుగుల మేర నీరు చేరుకుంది. ఫలితంగా ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం కష్టంగా మారింది. ఇళ్లలోకి నీరు చేరుకోవడంతో బాధితులు సర్వం కోల్పోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa