ట్రెండింగ్
Epaper    English    தமிழ்

270 గుట్కా ప్యాకెట్లు పట్టివేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 13, 2022, 10:49 AM

నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత గుట్కా ప్యాకెట్లు విక్రయిస్తున్న గుజ్జులవారి పల్లె గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపు లోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 2700లు విలు వ చేసే 270 గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొ న్నట్లు అట్లూరు ఎస్ఐ నాగచిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ నాగచిరంజీవి మాట్లాడుతూ గుజ్జులవారిపల్లె గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు నిషేదిత గుట్కా ప్యాకెట్లు రహస్యంగా అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో తమ సిబ్బందితో వెళ్లి వాటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ దాడుల్లో పోలీస్ సిబ్బంది వెంకటేశ్వర్లు, రమణ, నాగేంద్ర పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa