ఏపీలోని భూ కుంభకోణం ఆసక్తికర మలుపులు తిరుగుతోందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్యం ఠాకూర్ పేర్కొన్నారు. అవినీతికి పాల్పడిన విజయసాయిరెడ్డి కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణను ఎదుర్కోవాల్సిందేనని అన్నారు. ఈ అంశంపై ప్రధాని మోదీ కార్యాలయం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ఇన్ సైడర్ ట్రేడర్ అయిన విజయసాయి అవినీతికి వారు సహకరిస్తున్నారా? అని అడిగారు. డెక్కన్ క్రానికల్ పత్రికకు వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్ని విషయాలను వెల్లడించారని... ఆ ఇంటర్య్వూని చదివి చర్యలు తీసుకోగలరా? అని ప్రశ్నించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa