గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల పొన్నూరు నియోజకవర్గంలో జరిగిన పలు సంఘటనలపై సజ్జలతో మాట్లాడారు. నియోజకవర్గంలో పార్టీ భవిష్యత్తు కార్యచరణ గురించి ముచ్చటించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పార్టీకి ఎవరు వ్యతిరేకంగా వ్యవహరించిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే వెంట రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి నారాయణరావు, మైనార్టీ నాయకుడు షేక్ సైఫుల్లా, కాపు యువ నాయకుడు ఆకుల రామ్మోహన్, అంజుమన్ కమిటీ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్, దండమూడి సర్పంచ్ భవనం వంశీ రెడ్డి, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ లంకపోతు పిచ్చి రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.