ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైన్స్ టీచర్లకు అవగాహన కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Oct 14, 2022, 06:14 PM

బాల శాస్త్రవేత్తలకు చక్కని వేదిక నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ అని జిల్లా సైన్స్ కోఆర్డినేటర్ రవీంద్రరెడ్డి అన్నారు. ఈ సందర్బంగా రాజంపేట జెడ్. పి. బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించి, ఉపాధ్యాయులకి దిశానిర్దేశం చేసారు. అనంతరం ఎన్. సి. ఎస్. సి. -2022 బ్రోచర్స్ ని ఆవిష్కరించారు.

విద్యార్థులలో సైన్స్ పట్ల ఆసక్తి, , సైన్స్ దృక్పధం పై పట్టు సాధించే చక్కని అవకాశం నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ కల్పిస్తుందని, 2022-23 సంవత్సరానికి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం పర్యావరణాన్ని అర్థం చేసుకోవటం, అనే అంశంపై ప్రతి పాఠశాల నుండి విధిగా ఒక ప్రాజెక్ట్ సిద్ధం చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అకడమిక్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్, జిల్లా అసోసియేట్ సైన్స్ ఆఫీసర్ రామచంద్ర, పాఠశాల హెచ్. మ్. లక్ష్మిదేవి, మండల విద్యాశాఖాధికారి రఘునాథ రాజు, రిసోర్స్ టీచర్స్ శివలక్ష్మి, మురళికృష్ణ, రవిశంకర్ రెడ్డి, 7 మండలాల నుండి 73 మంది సైన్స్ టీచర్స్ పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa