రాష్ట్ర రాజధాని అమరావతిలో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడంలో వైసీపీ సర్కారు విఫలమైందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శశించారు. శుక్రవారంనాడు ఆయన అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా అమరావతి పరిధిలో ఏర్పాటైన విట్, ఎస్ఆర్ఎం, అమృత విశ్వవిద్యాలయాలను సందర్శించారు. గురువారం కురిసిన వర్షానికి అమరావతి పరిధిలోని రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోగా...ఆ నీటిలోనే ఆయన నానా పాట్లు పడుతూ వర్సిటీలను పరిశీలించారు.
ఈ సందర్భంగా వైసీపీ సర్కారుపై వీర్రాజు విమర్శలు గుప్పించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడంలో వైసీపీ సర్కారు విఫలమైందని ఆయన ఆరోపించారు. అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించిన కారణంగానే అమరావతిలో ఈ విద్యా సంస్థలు తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేశాయన్నారు. వైసీపీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత దిగ్గజ వర్సిటీలకు వెళ్లేందుకు కూడా వీలు కాని పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ధ్వజమెత్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa