చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణానికి చెందిన వివాహిత (30)అదృశ్యమైందంటూ ఆమె తల్లి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కుటుంబ సమస్యల కారణంగా ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయిందని పేర్కొంది. వివాహిత ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల ఇళ్లల్లో వెతికినా ప్రయోజనం లేకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పలమనేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.