international | Suryaa Desk | Published :
Sun, Oct 16, 2022, 08:22 AM
ఉక్రెయిన్ సరిహద్దులోని బెల్గోరోడ్ ప్రాంతంలో రష్యా సైనిక శిక్షణ శిబిరంపై శనివారం దాడి జరిగింది. ఈ దాడిలో 11 మంది రష్యా సైనికులు మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరు సాయుధులు తుపాకీలతో సైన్యంపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఇక సైన్యం కాల్పుల్లో ఆ ఇద్దరు మృతి చెందారు. ఉక్రెయిన్లో ప్రత్యేక సైనిక ఆపరేషన్ కోసం వాలంటీర్లకు శిక్షణ ఇస్తున్న సమయంలో ఈ దాడి జరిగిందని రష్యా తెలిపింది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com