త్వరలోనే పరిపాలనా రాజధాని విశాఖ నుంచి సీఎం జగన్ విధులు నిర్వహిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖను పాలనా రాజధానిగా వద్దని అన్నవారంతా చరిత్రహీనులు అవుతారని అన్నారు. జనసేన పార్టీకి రాజకీయ పార్టీకి ఉండాల్సిన సిద్ధాంతాలు లేవని విమర్శించారు. 3 రాజధానులపై సీఎం నిర్ణయానికి ప్రజలు మద్దతు తెలుపుతున్నారని, పరిపాలనా రాజధానిగా విశాఖ తప్పక వస్తుందని అన్నారు.