వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద వరుసగా నాలుగో సంవత్సరం రెండవ విడత పెట్టుబడి సహాయం కోసం వైఎస్సార్ జిల్లా మొత్తానికి సుమారు 85 కోట్ల రూపాయల మెగా చెక్ పంపిణీ కార్యక్రమం మైదుకూరు స్థానిక నంద్యాల రోడ్డు లో గల కశెట్టి కళ్యాణ మండపంలో సోమవారం నిర్వహించడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి పి. ప్రసన్న ఓ ప్రకటనలో తెలిపారు.
కావున మైదుకూరు నియోజక వర్గ పరిధి లోని వైఎస్ఆర్సీపీ నాయకులు, పురపాలక, మండల అధ్యక్షులు, పురపాలక, ఉప మండల అధ్యక్షులు, కౌన్సిలర్ లు, వార్డ్ ఇంఛార్జిలు, జెడ్పీటీసీ, ఎంపీటీసి, సర్పంచ్ లు, సొసైటీ ప్రెసిడెంట్, పత్రికా ప్రతినిధులు, రైతులు మరియు సంభందిత శాఖల అధికారులు తప్పకుండా పాల్గొనాలని తెలిపారు.