ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మన దేశం కంటే ఆ దేశాలే ముందు వరుసలో

national |  Suryaa Desk  | Published : Mon, Oct 17, 2022, 01:27 AM

నేటికీ పురోగతి సాధించని దేశాలుగా పేరున్న దేశాలు ఆకలి సూచీలో మన కంటే మెరుగా ఉండటం ఆందోళన కలిగిస్తున్న అంశం. అభాగ్యులు ఈ దేశంలో ఇప్పటికీ చాలా మందే ఉన్నారు. ఇందుకు నిదర్శనం అంతర్జాతీయ ఆకలి సూచీ 2022 ర్యాంకులే. భారత్ క్రితం ఏడాదితో పోలిస్తే ఆరు స్థానాలు కిందకు వెళ్లిపోయింది. 107వ స్థానాన్ని దక్కించుకుంది. మొత్తం 121 దేశాలతో ఈ సూచీ ర్యాంకుల నివేదిక విడుదలైంది. అంతర్జాతీయ ఆకలి సూచీలో దేశాల ర్యాంకు కేటాయింపునకు ప్రధానంగా చూసే అంశాలు.. పోషకాహార లేమి (కావాల్సినన్ని కేలరీలు లభించకపోవడం), చిన్నారుల మరణాలు, వృద్ధి సరిగ్గా లేకపోవడం, బరువు తక్కువ ఉండడం. 


దక్షిణాసియా దేశాల్లో అప్ఘానిస్థాన్ మినహా మిగిలిన అన్ని దేశాలు ఈ విషయంలో భారత్ కంటే మెరుగ్గా ఉండడం గమనించాలి. పాకిస్థాన్ 99, శ్రీలంక 64, బంగ్లాదేశ్ 84, నేపాల్ 81, మయన్మార్ 74వ ర్యాంకుల్లో నిలిచాయి. భారత్ కంటే దిగువన ఉన్నవి జాంబియా, అప్ఘనిస్థాన్, టిమోర్ లెస్టే, గయానా బిసా, సియెర్రా లియోన్, లెసోతో తదితర దేశాలున్నాయి. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com