నెల్లూరు జిల్లాలోని దామోదరం సంజీవయ్య థర్మల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు టెండర్లు పిలవాలన్న నిర్ణయాన్ని జగన్‌రెడ్డి వెనక్కు తీసుకోవాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ డిమాండ్ చేశారు. ఆదివారం టీడీపీ జాతీయ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. కమీషన్ల కోసం ఎక్కువ ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వ పెద్దలు ఈ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపేసి, పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తిని చేసి, రాష్ట్ర ప్రగతికి పాటుపడాలని రఫీ కోరారు.