ఉత్తరాంధ్ర ప్రజలకు రాజధాని ప్రాంత కోరిక లేదనే గొంతుకలు, మాయమాటలు చెప్పేవారికి, విశాఖ రాజధానిని అడ్డుకునేవారికి నిన్న జరిగిన గర్జన కార్యక్రమం ఒక కనువిప్పు అని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి వ్యతిరేకంగా మాట్లాడేవారి మనసులు మార్చుకోవాలని విశాఖ ప్రజలు గట్టి తీర్పు, వార్నింగ్ ఇచ్చారన్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన దగ్గర నుంచి, అలాగే జేఏసీ ఏర్పాటు అయినప్పటి నుంచి రాష్ట్రంలో కొందరు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో వికేంద్రీకరణ జేఏసీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. ఉత్తరాంధ్రపై చంద్రబాబు, పవన్ కల్యాణ్, ఎల్లో మీడియాకు ఎందుకు అంత ద్వేషం అని ప్రశ్నించారు.