ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా ఉత్తరాంధ్రకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుంది. విశాఖ నగరం మరింత అభివృద్ధి చెందుతుంది. దాన్ని ఎవ్వరూ ఆపలేరు అని ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రశాంతమైన విశాఖ ఒక అలజడి నగరంగా మారిందంటే దానికి కారణం జనసేన. చంద్రబాబు దగ్గర ప్యాకేజీ తీసుకున్న ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అని మంత్రి ఉద్ఘాటించారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై దాడి చేస్తే చర్యలు తీసుకోవడం తప్పా..? ప్రజాప్రతినిధులపై దాడి చేసిన వారిన సన్మానించాలా అని ప్రశ్నించారు. విశాఖ ఎయిర్‌పోర్టు వద్ద జరిగిన దాడికి ఆజ్యం పోసి, అహింసను ప్రోత్సహించింది పవన్ కల్యాణ్ అని మంత్రి అంబటి రాంబాబు పునరుద్ఘాటించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు.