భారతదేశంలో తాజాగా ఒమిక్రాన్ సబ్-వేరియంట్ BF.7 మొదటి కేసు బయటపడింది. గుజరాత్ బయో టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ పరీక్షలో ఇది వెల్లడైంది. దీనిపై సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మాధవి జోషి స్పందించారు. ప్రజలు భయాందోళనలకు గురి కావొద్దని పేర్కొన్నారు. ప్రజలు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఇదిలా ఉండగా చైనాలో ఇటీవల రెండు కొత్త ఒమిక్రాన్ సబ్-వేరియంట్లు BF.7, BA.5.1.7 కనుగొనబడ్డాయి.