తిరుపతి జిల్లా పాతవీరాపురం గ్రామానికి లీలావతి కడప జిల్లాకు చెందిన శ్రీహరిని 8 నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. అక్టోబర్ 14న ఆమె తన తల్లిగారింటికి వచ్చింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ప్రేమ పెళ్లి చేసుకుంటే కట్టుబాటు ప్రకారం రూ.50వేల జరిమానా కట్టాలన్నారు. నగదు లేకపోవడంతో సమయం అడిగారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు లీలావతి పై దాడి చేయడంతో ఆమెకు గర్భస్రావమైంది. రుయా ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.