ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్టీ నాయకత్వం విఫలం... కన్నా లక్ష్మీనారాయణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 19, 2022, 06:26 PM

పార్టీని నడిపే విషయంలో రాష్ట్ర నాయకత్వం పూర్తిగా విఫలమైందని బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తమతో పొత్తులో ఉన్న జనసేనతో సమన్వయం చేసుకోవడంలోనూ రాష్ట్ర నాయకత్వం విఫలమైందని ఆయన అన్నారు. ఈ భావన ఇప్పటిదాకా తన మనసులోనే ఉన్నదని, ఇప్పుడది బయటకు వచ్చిందని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై పార్టీ అధినాయకత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా కన్నా వ్యాఖ్యానించారు.


అసలు పార్టీ రాష్ట్ర శాఖలో ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదని కూడా కన్నా అన్నారు. గతంలో తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ప్రతి రెండు నెలలకు ఓ సారి కోర్ కమిటీ భేటీ ఏర్పాటు చేసుకుని ఆయా సమస్యలు, అంశాలపై చర్చించుకునే వారమని కన్నా గుర్తు చేశారు. అయితే ఇప్పుడు సోము వీర్రాజు ఒక్కరే అన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారని, అసలు కోర్ కమిటీ సమావేశాలే జరగడం లేదన్నారు. ఫలితంగా పార్టీ రాష్ట్ర శాఖలో ఏం జరుగుతుందో పార్టీ నేతలకే తెలియడం లేదన్నారు. జనసేనతో పార్టీ కీలక నేత మురళీధరన్ సమన్వయం చేస్తారని తెలిసినా.. ఎందుకనో ఆ దిశగానూ అడుగులు పడలేదని కన్నా అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com