చిలకలూరిపేట నియోజకవర్గ రైతులను పరామర్శించే క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఓకాలువను దాటాల్సి వచ్చింది. ఆయన ఏమాత్రం సంకోచించకుండా ఆ కాలువను అలవోకగా దాటేశారు. ఈ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 72 ఏళ్ల వయసులో కూడా భద్రతా సిబ్బంది వెన్నంటే ఉన్నా చంద్రబాబు వారి సాయం తీసుకోలేదు. గార్డు చెయి అందించబోతే సున్నితంగా తిరస్కరించి. తానే స్వయంగా కాలువను దాటారు.