ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలు జిల్లాలో పడగవిప్పిన ఫ్యాక్షన్...కోట్ల ప్రధాన అనుచరుడి హత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 19, 2022, 11:53 PM

రాయలసీమలో మరో ఫ్యాక్షన్ హత్య జరిగింది. కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ భూతం మరోసారి పడగవిప్పింది. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ప్రధాన అనుచరుడు సిద్ధప్పను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. కోడుమూరులో ఆయన తన అనుచరులతో కలిసి ఉండగా ప్రత్యర్థులు దాడిచేసి వేట కొడవళ్లతో నరికి చంపారు. ఒక పక్కా ప్లాన్ తోనే ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోడుమూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 


సిద్ధప్పది గోనెగండ్ల మండలం కున్నూరు గ్రామం. 2008లో దారుణహత్యకు గురైన కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడు హత్య కేసుతో పాటు మరో మూడు హత్యల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. కొంత కాలంగా కున్నూరును విడిచి కోడుమూరులో తలదాచుకుంటున్నారు. ఆయన కదలికను పసిగట్టిన ప్రత్యర్థులు పక్కా ప్లాన్ తో దాడి చేసి, హతమార్చారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ హత్యతో కోడుమూరులో భయాందోళనలు నెలకొన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com