కృష్ణా జిల్లాలో పర్యటన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కొల్లూరు వెంకటేశ్వరరావు ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతల కు ఆంక్షలు విధించారు. ఈక్రమంలో పార్టీ కార్యాలయం నుంచి కొల్లూరు వెంకటేశ్వరరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంకటేశ్వరరావును ఎక్కడికి తీసుకువెళ్లారో పోలీసులు చెప్పకపోవడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.