ఆముదాలవలసలో ఆయుష్మాన్ భారత్ సర్వే కేంద్ర ప్రభుత్వం పథకం కావడంతో భారత్ పీఎంజేవై హెల్త్ కార్డు మంజూరు నిమిత్తము సర్వే నిర్వహిస్తున్నారు. గురువారం తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు ఫోటో అప్లోడింగ్ మొబైల్ కి వచ్చే ఓటీపీ ఆధారంగా ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డుదారులు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరితే వైద్య ఖర్చులకు ఐదు లక్షల వరకు కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని సంబంధిత శాఖ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమం ఆముదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని ఐదు నాడు కాలనీ పరిసర ప్రాంతాల్లో సిబ్బంది కుటుంబ వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారు.