తాడేపల్లి పట్టణంలో సంజీవని ఉచిత ఆరోగ్య కేంద్రాన్ని నారా లోకేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. దుగ్గిరాల మండలానికి ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య కేంద్రం, మంగళగిరి, తాడేపల్లి లో ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.... ఇప్పటి వరకూ పది వేల మందికి వైద్య సహాయం అందించడం జరిగింది. త్వరలోనే బిపి, షుగర్ ఉన్న వారికి ప్రతి 15 రోజులకోసారి టీడీపీ తరపున మందులు ఇంటి వద్దే అందించడం జరుగుతుంది అని తెలియజేసారు.