గుంతకల్లు మున్సిపాలిటీ పరిధిలోని గుత్తి రోడ్డు వద్దనున్న కంపోస్ట్ యార్డు నందు ఎంఆర్ఎఫ్ సెంటర్లో జరుగుతున్న పనులను మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న శుక్రవారం ఉదయం పరిశీలించారు. ఎంఆర్ఎఫ్ సెంటర్ లో సెక్రిగేషన్ షెడ్డు నందు జరుగుతున్న డ్రైవెస్ట్ తడి చెత్త పొడి చెత్తను వేరుచేసి వాటి ద్వారా సేంద్రియ ఎరువుల తయారీ విధానాన్ని పరిశీలించారు. కంపోస్ట్ యార్డ్ లో పనిచేస్తున్న మున్సిపల్ సిబ్బందికి సేగ్రిగేషన్ మరియు డ్రైవెస్ట్ విధానాన్ని సూచించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు వేణుగోపాలరెడ్డి మరియు చంద్రశేఖర్ మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.