ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాద రావు రాజీనామాకు సిద్ధమయ్యారు. శుక్రవారం సీఎం జగన్‌ను కలిసిన ఆయన తన రాజీనామా ప్రతిపాదనను తెలిపారు. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలనే ఉద్యమాన్ని నడిపించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. తన రాజీనామాను ఆమోదించాలని ముఖ్యమంత్రిని కోరారు. అయితే ఆయనను సీఎం జగన్ వారించారు. మూడు రాజధానులకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం హామీ ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa