కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ సంఘటన శనివారం కురబలకోట మండలంలో చోటు చేసుకుంది. మట్లివారిపల్లి పంచాయతీ, ఎర్ర మద్దివారిపల్లికి చెందిన శ్రీనివాసులు భార్య శిరీష(24) పిల్లలు బడికి వెళ్లడం లేదని కొట్టడంతో భర్త భార్యను మందలించాడు. దీంతో మనస్తాపంచెందిన శిరీష పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మదనపల్లి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు