జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నేత వర్ల రామయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ... ‘‘వాసిరెడ్డి పద్మ గారూ.. మీ కమిషన్ గతంలో చంద్రబాబుకు, ఇప్పుడు పవన్ కు నోటీసులు ఇచ్చింది. కడప జిల్లా మైదుకూరులో అప్పు తీర్చలేదని ఓ దళితుడి భార్యను.. ఓ వైసీపీ నేత అపహరించి తన ఇంట్లో బంధించారు. అప్పు తీర్చేంత వరకు పంపేది లేదంటే మీ కమిషన్ ఏం చేస్తోంది’’ అంటూ వర్ల రామయ్య ట్విట్టర్లో ప్రశ్నించారు.