ఇచ్చాపురం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు మంగళవారం పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ నాయకులు దాసరి రాజు మాట్లాడుతూ.. ప్రజల కష్టాల నుంచి పుట్టిన నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అని, ప్రజలను ప్రలోభ పెట్టి, కృత్రిమంగా మంత్రి అయినా వ్యక్తి అప్పలరాజుని అన్నారు. జనాభిమానం లేని వ్యక్తి దువ్వాడ శ్రీనివాసన్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ దుర్యోధన ఉన్నారు.