శ్రీకాకుళం జడ్పీ నూతన సమావేశ మందిరంలో రేపు జరగాల్సిన సాధారణ సమావేశం ఈనెల 28 కి వాయిదా వేసినట్లు జడ్పీ సీఈవో ఆర్ వెంకట్రామన్ మంగళవారం తెలిపారు. ఈనెల 26వ తేదీన ఏర్పాటు చేసిన బీసీ గర్జన సమావేశానికి జిల్లా నుంచి పలువురు నాయకులు, అధికారులు హాజరవుతున్న నేపథ్యంలో ఈ సమావేశం వాయిదా అనివార్యమైందని అన్నారు. సభ్యులంతా ఈ విషయాన్ని గమనించి ఈనెల 28 ఉదయం 10: 30 గంటలకు జడ్పీ నూతన సమావేశ మందిరంలో హాజరుకావాలని కోరారు.