చిత్తూరు: తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండలం పిచ్చలవాండ్లపల్లెలోని సచివాలయ భవనాన్ని ప్రారంభించాలని గ్రామస్తులు కోరుతున్నారు. సచివాలయానికి అవసరమైన ఆధునిక కార్యాలయం లేకపోవడంతో ఏడాది క్రితం నూతన భవన నిర్మాణం చేపట్టారు. ఆరు నెలల క్రితమే సచివాలయ భవన నిర్మాణం పూర్తయిన ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు. భవనాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో దిలీప్ కుమార్ తెలిపారు.