రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు అత్యధిక ప్రాధాన్యం అన్నిరంగాల్లో ఇస్తున్నారని చీరాలకు చెందిన దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు మాటలు చెప్పేవారని, ఇందుకు భిన్నంగా జగన్ చేతలలో బీసీలకు పెద్దపీట వేస్తున్నారనిఆయన తెలిపారు. తాడేపల్లిలో బుధవారం రాత్రి జరిగిన వైఎస్సార్సీపీ బీసీ విభాగం సదస్సులో సురేంద్ర పాల్గొని ప్రసంగించారు. ఎమ్మెల్సీ, పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, రాజ్యసభ సభ్యులు, పార్టీ అగ్రనేతలు విజయసాయిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పలువురు బీసీ ప్రజాప్రతినిధులు పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు