త్వరలో జరగబోయే పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ మరియు పట్టభద్రుల ఎన్నికలలో ఉద్యమ చరిత్ర కలిగిన నాయకులైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి ని, పట్టభద్రుల అభ్యర్థి పోతుల నాగరాజు ని గెలిపించుకోవాలని ఎస్టీయూ రాష్ట్ర నాయకులు వై. సుబ్రహ్మణ్యం రాజు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక ఏఐటీయూసీ భవన్ నందు ప్రజాసంఘాల సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగినది.
ఈ సన్నాహక సమావేశానికి ఎస్ టి యు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు వై. సుబ్రహ్మణ్యం రాజు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం యొక్క ఏకపక్ష విధానాలు ఎండగట్టడానికి ఉద్యమ చరిత్ర కలిగిన అభ్యర్థు లే అవసరమన్నారు.