సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామంలో ఏపీజెన్‌కో ప్రాజెక్ట్ మూడో యూనిట్ (800 మెగావాట్లు) జాతికి అంకితం చేశారు. ప్రభుత్వ రంగంలో దేశంలోనే మొదటిదైన ఈ సూపర్ క్రిటికల్ యూనిట్ రోజుకు 19 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్లాంట్‌ను సీఎం వైయస్ జగన్ ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. సాధారణ థర్మల్ పవర్ ప్లాంట్లతో పోలిస్తే ఈ ప్లాంట్‌లో తక్కువ బొగ్గును వినియోగిస్తారు. దీనివల్ల పర్యావరణంపై ప్రతికూల ప్రభావం కొంత మేర తగ్గుతుంది. రోజుకు 9,312 టన్నుల బొగ్గుతో నడిచేలా ఈ యూనిట్‌ను రూపొందించారు. కార్యక్రమంలో మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంబటి రాంబాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు.