గత వారం రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల భిక్షాటన చేసే వృద్ధులు, వికలాంగులు, సాధువులు, చలికి కప్పుకోవడానికి సరైన వస్త్రం లేక చాలా ఇబ్బంది పడుతున్నారని, రాత్రి పూట చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఇలాంటి పేదలను ఆదుకునేందుకు మైదుకూరు కు చెందిన ఆదరణ సేవా సంస్థ వారు గురువారం ఫుట్ పాత్ లపై పడుకున్న నిరాశ్రయులకు, దేవాలయలదగ్గర, బస్ స్టాండ్, మసీదుల దగ్గర, రాత్రి పూట నిద్రిస్తున్న పేదలకు దుప్పట్లు పంచడం జరిగింది.
ఈ సందర్భంగా ఆదరణ సేవా సంస్థ సభ్యులు నియాజ్ మాట్లాడుతూ. ఒకవైపు చలి, మరోవైపు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు ఎక్కువ ఉన్నందున నిరాశ్రయులకు ఈ దుప్పట్లు పంపిణీ చేస్తున్నాము అని తెలిపారు.
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసన్నకుమార్, నియాజ్, మస్తాన్, శివ, మున్నా, అబ్దుల్, రవిరాజా, కేర్ క్లబ్ యాసిన్, తదితరులు పాల్గొన్నారు.