ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రంలో డయేరియాతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు విజయవాడలో కబడ్డీ ఆడుకుంటున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 26, 2026, 12:21 PM

శ్రీకాకుళంలో డయేరియా మరణాలకు ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం అని మాజీ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. అయన మాట్లాడుతూ... శ్రీకాకుళంలో కలుషిత తాగునీటి కారణంగా డయేరియా ప్రబలిందని మూడు రోజుల క్రితమే స్థానిక న్యూస్‌ ఛానెళ్లు, యూట్యూబర్లు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. కానీ ఇక్కడున్న ఎమ్మెల్యే, మంత్రి, కేంద్ర మంత్రులు ఇంతవరకు స్పందించిన దాఖలాలు లేవు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు విజయవాడలో కబడ్డీ ఆడుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. కలుషిత నీరు తాగి తన భర్త వాంతులు, విరేచనాలతో చనిపోతే అధికారులు మాత్రం డయేరియల్‌ డెత్‌ కాదని, ప్రభుత్వానికి సంబంధం లేదని చెబుతున్నారని ఒక మహిళ ఆవేదన వ్యక్తం చేస్తోంది. మరణాల సంఖ్యను తగ్గించే చూపే కుట్రతో ముగ్గురి మరణాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాచి పెడుతోంది. వేరే అనారోగ్య కారణాలతో చనిపోయారని ప్రచారం చేస్తోంది. లివర్, గుండె జబ్బులుంటే వారికి డయేరియా రాదని ఏ డాక్టర్‌ చెప్పాడు?. చంద్రబాబు సీఎం కాగానే, నాడు విజయనగరం జిల్లా గుర్లాం మండలంలో డయేరియాతో ఒకే గ్రామంలో 13 మంది చనిపోయారు. ఆ సంఘటన మొదలు వరుసగా డయేరియా మరణాలు నమోదవుతూనే ఉన్నాయి. విజయవాడ సిటీ, గుంటూరులోని తురకపాలెం, గురజాల.. ఇలా ఎన్నో చోట్ల అమాయక ప్రజలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైపోయారు అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa