కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యానికి మంచిది కాదు. దానిని 3 వారాల్లోనే సులుభ పద్దతుల ద్వారా తగ్గించుకోవచ్చు. ఇందులో ముఖ్యమైంది వ్యాయామం. రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలు వంటి ఆహార పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి. యాపిల్ వంటి ఫైబర్ అధికంగా పదార్ధాలు తీసుకోవాలి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ అవశేషాల్ని తగ్గిస్తాయి. దీంతోపాటు నట్స్, సీడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. మద్యపానానికి దూరంగా ఉండాలి. మద్యం ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే అవకాశముంది.