ఖర్జూరాలు పొటాషియం ఎక్కువగా లభిస్తుంది. ఇవి తినడం వల్ల గుండె కొట్టుకునే రేటు, రక్తపోటు అదుపులో ఉంటాయి. అలాగే గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు.
- ఖర్జూరం పండ్లలో శరీరానికి కావాల్సిన ఖనిజాలు, విటమిన్లు, ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి.
- ఖర్జూరాల్లో కొలెస్ట్రాల్, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి తింటే ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న భావన కలిగి బరువును అదుపులో ఉంచుకోవచ్చు.
- ఖర్జూరాల్లో యాంటీఆక్సిడెంట్ల రూపంలో ఉండే విటమిన్ ‘ఎ’ కంటికి చాలా మంచిది. ఈ పండు వల్ల రేచీకటి, ఇతర కంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
- ఖర్జూరాల్లో క్యాల్షియం, మెగ్నీషియం, కాపర్ వంటి ఖనిజాలు అధికంగా లభిస్తాయి. క్యాల్షియం ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచడానికి, కాపర్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి, మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
- ఖర్జూరాలు బరువు పెరగడానికి కూడా సహాయపడతాయి.
- మలబద్ధకంతో బాధపడే వారు కొన్ని ఖర్జూరాల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే పరగడుపున వాటిని తిని, ఆ నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
- ఖర్జూరంలో బి-కాంప్లెక్స్‌తో పాటు ‘కె’ విటమిన్ కూడా ఉంటుంది. నియాసిన్, రైబోఫ్లేవిన్, పాంటోథెనికామ్లం, పైరిడాక్సిన్ మొదలైన పోషకాలు శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేస్తాయి.
- ఖర్జూరాల్లో ఉండే విటమిన్ ‘బి6’ వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
- మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రం సరిగ్గా రాకపోవడం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తదితర సమస్యలు ఖర్జూరం తినడం వల్ల తగ్గే అవకాశం ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa