పరిపాలనలో కీలకంగా వ్యవహారించే ప్రభుత్వ ఉన్నతాధికారులు అందమైన యువతులపై కన్నేశారు. ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని ఆశచూపి తమ లైంగికవాంఛను తీర్చుకున్నారు. ఏకంగా 20 మంది యువతులపై వారు లైంగికదాడి చేయడం గమనార్హం. కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ప్రధాన కార్యదర్శి జితేంద్రనారాయణ్, లేబర్ కమిషనర్ ఆర్‌ఎల్ రిషిలు తమపై లైంగికదాడి చేశారని కొందరు యువతులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వేర్వేరుగా వారి ఇళ్లకు తీసుకెళ్లి కోరిక తీర్చుకుని తమకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa