మన పంజాబీ నెదర్లాండ్స్ టీమ్‌లో ఉన్నాడు. ఇప్పుడు ఇండియాపైనే ఆడుతున్నాడు. ఈ 19 ఏళ్ల విక్రమ్‌జీత్ సింగ్ ఓపెనర్‌గా బరిలో దిగబోతున్నాడు. 1984లో పంజాబ్‌ను వదిలి నెదర్లాండ్స్‌కు వెళ్లింది విక్రమ్ కుటుంబం. ట్రాన్స్‌ఫోర్ట్ కంపెనీ ప్రారంభించి అక్కడే సెటిల్ అయింది. చిన్నతనం నుంచే క్రికెట్ అంటే ప్రాణమిచ్చే విక్రమ్‌జీత్.. అండర్ 12 స్టేజ్ నుంచే ఆడుతున్నాడు. ఆ సమయంలోనే అప్పటి నెదర్లాండ్స్ కెప్టెన్ పీటర్ బోరెన్.. విక్రమ్‌జీత్‌ను గమనించాడు. అతని కోసం తాను కూడా నెట్స్‌లో గంటల తరబడి గడిపాడు. దీంతో విక్రమ్‌జీత్ కెరీర్ మలుపు తిరిగింది. 17 ఏళ్లకే జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa