అద్భుతమైన ఫీచర్లతో కొత్త మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్లు మార్కెట్‌లోకి వచ్చేశాయి. 7 విభిన్న కలర్ ఆప్షన్లతో ప్రీమియం డిజైన్‌ను అందిస్తున్న ఈ సిరీస్‌ను మోటోరోలా రేజర్ 2026గా కంపెనీ విడుదల చేసింది. అతి త్వరలో ప్రపంచ మార్కెట్లలో ఫస్ట్ సేల్ ప్రారంభం కానుంది.Motorola Razr 70 Series : కొత్త మోటోరోలా ఫోల్డబుల్ ఫోన్లు ఒకేసారి మూడు మోడళ్లతో లాంచ్ అయ్యాయి. Motorola Razr Ultra 2026, Motorola Razr Plus 2026, Motorola Razr 2026 అనే మూడు వేరియంట్లను కంపెనీ గ్లోబల్‌గా పరిచయం చేసింది. క్లామ్‌షెల్ ఫోల్డబుల్ సెగ్మెంట్‌లో ఈ సిరీస్ కొత్త స్టాండర్డ్స్ సెట్ చేస్తుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.ఈ సిరీస్ రాబోయే నెలల్లో ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులోకి రానుంది. మొత్తం 7 పాంటోన్ కలర్ ఆప్షన్లతో ఈ ఫోన్లు లాంచ్ కావడం మరో ప్రత్యేకత.హై-ఎండ్ మోడళ్లైన Razr Ultra 2026 మరియు Razr Plus 2026 స్నాప్‌డ్రాగన్ 8 సిరీస్ ఆక్టా-కోర్ చిప్‌సెట్‌లతో పనిచేస్తాయి. ఇక బేస్ మోడల్ Razr 2026లో మీడియాటెక్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. Ultra మరియు Plus వేరియంట్లలో 4-అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉండగా, స్టాండర్డ్ మోడల్‌లో 3.6-అంగుళాల ఎక్స్‌టర్నల్ స్క్రీన్ అందించారు.
*ధర & లభ్యత : Razr Ultra 2026 ధర సుమారు 1,499.99 డాలర్లు (దాదాపు రూ.1,43,000)గా ఉంది. Razr Plus 2026 ధర 1,099.99 డాలర్లు (దాదాపు రూ.1,05,000), Razr 2026 ధర 799.99 డాలర్లు (దాదాపు రూ.76,000)గా నిర్ణయించారు.Ultra మోడల్ యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా పసిఫిక్ ప్రాంతాల్లో అందుబాటులోకి రానుంది. Plus మరియు బేస్ మోడళ్లు కూడా వివిధ ప్రాంతాల్లో విడివిడిగా లాంచ్ కానున్నాయి. మే 14 నుంచి కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి.
*స్పెసిఫికేషన్లు :ఈ సిరీస్ Android 16 ఆధారిత Hello UIపై పనిచేస్తుంది. కంపెనీ 3 ఏళ్ల OS అప్‌డేట్స్, 5 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందించనున్నట్లు ప్రకటించింది.Ultra మరియు Plus మోడళ్లలో 4-అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉండి 165Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తాయి. Ultra మోడల్‌లో 7-అంగుళాల LTPO AMOLED ఫోల్డబుల్ డిస్‌ప్లే ఉండి 165Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్ సపోర్ట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.Plus మరియు బేస్ వేరియంట్లలో 6.9-అంగుళాల ఫోల్డబుల్ AMOLED స్క్రీన్ ఉంటుంది. Plus మోడల్ 165Hz రిఫ్రెష్ రేట్‌ను, బేస్ మోడల్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది.పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే Ultra మోడల్ Snapdragon 8 Elite చిప్‌తో, Plus మోడల్ Snapdragon 8s Gen 3తో, బేస్ మోడల్ MediaTek Dimensity 7450Xతో రన్ అవుతుంది. RAM 8GB నుంచి 16GB వరకు, స్టోరేజ్ 256GB నుంచి 512GB వరకు ఉంటుంది.
*కెమెరా & బ్యాటరీ : ఈ సిరీస్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. 50MP మెయిన్ కెమెరాతో పాటు మాక్రో లెన్స్ ఉంటుంది. Ultra మోడల్‌లో 50MP ఫ్రంట్ కెమెరా కూడా ఉంది. Plus మరియు బేస్ మోడళ్లలో 32MP సెల్ఫీ కెమెరా అందించారు.బ్యాటరీ పరంగా Ultra మోడల్‌లో 5000mAh బ్యాటరీ ఉండగా, Plus మోడల్‌లో 4500mAh, బేస్ మోడల్‌లో 4800mAh బ్యాటరీ ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa