మెదక్ జిల్లా: పాపన్నపేట మండలం ఆరేపల్లి గ్రామంలో గురువారం ఓ ప్రమాదకర ఘటన చోటుచేసుకుంది. 11 కేవీ విద్యుత్ వైర్లకు తగిలి హార్వెస్టర్ యంత్రం పూర్తిగా మంటల్లో దగ్ధమైంది.హవేళిగణపూర్ మండలం పాటిగడ్డ గ్రామానికి చెందిన రమేష్ నాయక్‌కు చెందిన ఈ హార్వెస్టర్‌ను శ్రీకాంత్ రెడ్డి పొలంలో కోత పనులకు వినియోగిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా స్పందించి వెంటనే కిందికి దూకడంతో పెద్ద ప్రాణాపాయం తప్పింది.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే యంత్రం పూర్తిగా కాలిబూడిదైనట్లు తెలిపారు. ఈ ఘటనలో సుమారు రూ.13 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని రమేష్ నాయక్ ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa