మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. అమరావతిలోని ప్రభాత్ సినిమా ఏరియాలో భవనం కూలిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ విషాద ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.