తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన చంద్రిత, రామచంద్రపురానికి చెందిన చంద్రశేఖర్ ప్రేమించుకొని 9 నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఈ నెల 20న కోవనూర్ సమీపంలో యువతి శవం దొరకగా అది చంద్రితదేనని, చంద్రశేఖర్ ను శిక్షించాలని ఆమె తల్లితండ్రులు ఆందోళన చేశారు. వారికి టీడీపీ, జనసేన మద్దతు పలికింది. తాజాగా ఆ జంట తాము బతికే ఉన్నామని వీడియో విడుదల చేసింది. చంద్రశేఖర్ కు చంద్రితతో పరిచయం కంటే ముందే వివాహమై కొడుకు కూడా ఉన్నాడు.