ఉద్యోగులు, స్తోమత ఉన్న వారు ఇంట్లో పనులకు మహిళలను నియమించుకుంటారు. కొందరు వారు చేసే పనిని చులకనగా చూస్తారు. అయితే కొందరు యజమానులు మాత్రం కుటుంబ సభ్యుల్లో ఒకరిగా వారితో వ్యవహరిస్తారు. తాజాగా ఓ పనిమనిషి బర్త్ డేను ఆమె యజమానురాలు సెలబ్రేట్ చేశారు. కేక్ తీసుకొచ్చి ఆమెతో కట్ చేయించారు. ఆమెతో కలిసి సంతోషంగా ఫొటోలు దిగారు. తన యజమానురాలు చేసిన పనితో ఆ మహిళ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయింది. viralbhayani అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ అయిన ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. పనిమనిషి బర్త్ డే చేసిన ఆమె యజమానురాలిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.