ఉపాధ్యాయ బదిలీల జీవోను విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడం తగదని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి నరసింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కోర్టు రోడ్డులోని నెహ్రూ మున్సిపల్ స్కూల్‌లో ఆ సంఘం సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. బదిలీల జీవోపై అదిగో ఇదిగో అంటూ ప్రభుత్వం లీకులు విడుదల చేస్తూ అసలు జీవో విడుదల చేయకుండా టీచర్లతో ఆడుకుంటోందన్నారు. వెంటనే జీవో విడుదల చేయాలని, అలా కానిపక్షంలో ఎప్పుడు విడుదల చేస్తారో ప్రకటించాలన్నారు. లేకుంటే.. జీవో విడుదలకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. జిల్లా గౌరవాధ్యక్షుడు ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడు వెంకటేశులు, ప్రధానకార్యదర్శి సిరాజుద్దీన్, సహ ప్రధానకార్యదర్శి హనుమప్ప మాట్లాడుతూ ఫేస్ ఆధారిత హాజరు వివిధ సాంకేతిక కారణాలతో రికార్డు కావడానికి ఆలస్యమవుతోందన్నారు. దీనికి టీచర్లను బాధ్యులను చేయడం, మెమో లు ఇవ్వడం హేయమన్నారు. కార్యక్రమంలో నాయకులు నాగరాజు, భాస్కర్, సతీష్, డేనియల్, మోహన్‌రెడ్డి, సుభద్ర, అంజలీదేవి, రమణ, సర్ధార్‌వలి, కిషోర్, సుంకప్ప, వన్పప్ప, పూర్ణచంద్ర, ఈశ్వరయ్య పాల్గొన్నారు.