అంతర్జాతీయ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈనెల ఆరవ తేదీన అనకాపల్లిలో నిర్వహించనున్న వాసవి క్లబ్ జిల్లా సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరు కావలసిందిగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ను మంగళవారం ఆహ్వానించినట్టు జిల్లా గవర్నర్ ఎస్ శ్రీను తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించి ప్రోత్సహించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వాసవి క్లబ్ ప్రతినిధులు కే సతీష్, వివి బుచ్చిరాజు, జి గుప్తా, కే లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.