అమరావతి రైతుల పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. రైతుల పాదయాత్రను రద్దు చేయాలంటూ డీజీపీ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌ను కూడా హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు షరతులకు లోబడి పాదయాత్ర నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. గతంలోని ఉత్తర్వుల్లో మార్పులు చేయబోమని స్పష్టం చేసింది. రైతులు షరతులు ఉల్లంఘిస్తే హైకోర్టును ఆశ్రయించవచ్చని డీజీపీకి హైకోర్టు స్పష్టం చేసింది.